AP: అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇతర కీలక అభివృద్ధి ప్రాజెక్టులను పక్కనపెట్టి మొత్తం నిధులను అమరావతికే మళ్లిస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణ వ్యయం, నిధుల కేటాయింపులపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించారు.