AP: పల్నాడు నేత జంగా కృష్ణమూర్తి TTD బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. ఈ క్రమంలో జంగా కృష్ణమూర్తి నేడు లేదా రేపు ముఖ్యమంత్రిని కలవనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తిరుమలలో అతిథి గృహం నిర్మాణానికి స్థలం కేటాయింపు పునరుద్ధరణపై వచ్చిన కథనాలపై మనస్తాపం చెంది రాజీనామా చేసినట్లు జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు.