AP: అట్టర్ ప్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలు చేస్తున్నారని వైఎస్
జగన్ విమర్శించారు. బుధవారం తాడేపల్లిలో
జగన్ మాట్లాడుతూ.. "రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కాదు.. అట్టర్ ప్లాప్. యువతకు 3వేల నిరుద్యోగ భృతి అని చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ హామీ ప్రస్తావనే లేదు. ఆడబిడ్డ నిధి ఎగిరిపోయింది. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. దాన్ని కూడా ఎగొట్టారు." అంటూ తీవ్ర విమర్శలు చేశారు.