AP: కల్తీ మద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టయిన విషయం తెలిసిందే. సిట్ అధికారులు దాదాపు 11 గంటలకు పైగా విచారించారు. ప్రధాన నిందితుడు జనార్ధన్ రావుతో సంబంధాలపై ఆరా తీశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం విజయవాడ GGHకు తరలించారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు భారీగా ఆస్పత్రికి తరలిరావడంతో పోలీసులు, వారికి మధ్య తోపులాట చోటు చేసుకుంది. వ్యాన్ ఎక్కుతూ 'చంద్రబాబు నన్ను తప్పుడు కేసులో ఇరికించాడు' అని జోగి వ్యాఖ్యానించారు.