శతావతారాలు ఎత్తిన చంద్రబాబు: రాచమల్లు

961చూసినవారు
శతావతారాలు ఎత్తిన చంద్రబాబు: రాచమల్లు
AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి,  తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక కళ్యాణం కోసం మహావిష్ణువు దశావతారాలు ఎత్తితే, ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు శతావతారాలు ఎత్తారని ఆయన ఆరోపించారు. దళితుల ఇంట్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నిస్తూ, చెప్పులు కుట్టే అవతారం ఎత్తారని, ఎవరిని మోసగించడానికి ఇన్ని అవతారాలు ఎత్తారని చంద్రబాబును నిలదీశారు. గత రెండేళ్ల పాలనలో చంద్రబాబు శతావతారాలు ఎత్తారని రాచమల్లు అన్నారు.

సంబంధిత పోస్ట్