AP: సీఎం చంద్రబాబుపై
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కుల, మత, ధన రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు. సూపర్-6లో ఒక్క హామీని కూడా నెరవేర్చకపోయినా.. అన్నీ చేసేసినట్లు నిస్సిగ్గుగా విజయోత్సవాలు చేయడం కూడా ఒక్క చంద్రబాబుకే చెల్లింది. విశాఖపట్నంలో నీటి సమస్యతో జనం అల్లాడుతుంటే.. చంద్రబాబు అక్కడ బీచ్‌కి వెళ్లి మిక్చర్ తినడమేంటి?’ అని మండిపడ్డారు.