సచివాలయంలో బారికేడ్లపై చంద్రబాబు ఆగ్రహం

1763చూసినవారు
సచివాలయంలో బారికేడ్లపై చంద్రబాబు ఆగ్రహం
ఏపీ సచివాలయానికి వెళ్లే మార్గంలో పోలీసుల బారికేడ్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర సచివాలయమా లేక కమర్షియల్ కాంప్లెక్సా అని ప్రశ్నించారు. ప్రకటనలతో కూడిన బారికేడ్లు సచివాలయ ప్రాంగణాన్ని గందరగోళంగా మారుస్తున్నాయని అన్నారు. పింఛన్ల పంపిణీకి వెళ్ళినప్పుడు ఏర్పాట్లు బాగున్నాయని, సచివాలయం వద్ద మాత్రం బారికేడ్లు సరిగా లేవని పేర్కొన్నారు. దీంతో పోలీసులు యుద్ధ ప్రాతిపదికన బారికేడ్లను తొలగించి, పూలకుండీలను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్