ఎంపీ సానా సతీశ్‌పై చంద్రబాబు ఆగ్రహం!
By Rathod 45చూసినవారుAP: గన్నవరం విమానాశ్రయంలో క్రికెటర్ శ్రీచరణికి స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. మంత్రులు, శాప్, ACA ప్రతినిధులు విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ.. శ్రీచరణి ఉన్న లాంజ్‌లోకి BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్‌ను పోలీసులు అనుమతించలేదు. ఈ విషయంపై MSK ప్రసాద్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. MP, ACA సెక్రటరీ సానా సతీష్‌పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.