సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర ఆరోపణలు చేశారు. PPP విధానం సరైనదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పిందంటూ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. ఆ కమిటీ వైద్య విద్యను పెంచాలని, అసమానతలను తగ్గించాలని సూచించిందని, వైద్య విద్యను ప్రోత్సహించడానికి తగిన నిధులు లేకపోతే PPP విధానం తీసుకోవచ్చని చెప్పిందన్నారు. అయితే ప్రభుత్వ భూమి, మౌలిక సదుపాయాలు, నిధులు ఉన్నప్పుడు PPPకి ఇవ్వాలని చెప్పలేదని విడదల రజిని స్పష్టం చేశారు.