AP: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై అచంచల భక్తితో కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల కొండను కాలినడకన ఎక్కారు. ఆమె ఏమాత్రం అలసట లేకుండా నడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వైరల్ వీడియోపై CM చంద్రబాబు నాయుడు స్పందించి, ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆ బామ్మ వీడియోను షేర్ చేస్తూ.. ‘వయసు కేవలం అంకె మాత్రమేనని ఆమె నిరూపించారు’ అని కొనియాడారు. స్వామివారిపై ఆమెకున్న అపారమైన భక్తి, ఆమెకు అండగా నిలిచిన కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో అభినందనీయమని, ఇది ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని సీఎం ప్రశంసించారు.