వైరల్ అవుతున్న బండ్ల గణేశ్‌ కుమార్తె పెళ్లి పత్రిక

10261చూసినవారు
వైరల్ అవుతున్న బండ్ల గణేశ్‌ కుమార్తె పెళ్లి పత్రిక
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్‌లో జరగనుంది. వివాహ ఆహ్వాన పత్రికపై ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి పేర్లు ముద్రించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ అభిమానిగా పేరున్న బండ్ల గణేశ్‌.. చంద్రబాబు దంపతుల పేర్లను ఆహ్వాన పత్రికలో చేర్చడంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే బండ్ల గణేశ్‌కు నారా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ అభిమానంతోనే వారి పేర్లను ముద్రించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్