AP: మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాయమాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. బీసీలకు గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేసి, కొత్త హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు.