AP: చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని వైసీపీ ఆరోపించింది. జీతాలు ఇవ్వకపోవడంతో కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు తిరగబడుతున్నారని పేర్కొంది. బుధవారం ఎక్స్ వేదికగా.. ‘ప్రభుత్వ, కాంట్రాక్ట్, చిరుద్యోగులకు జీతాలు ఇవ్వకుండా చంద్రబాబు వేధిస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట సచివాలయానికి పారిశుద్ధ్య కార్మికురాలు చంద్రకళ తాళాలు వేసి నిరసన తెలిపారు’ అని ట్వీట్ చేసింది. ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేసింది.