AP: నేడు కృష్ణా జిల్లా, పమిడిముక్కలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10:25 గంటలకు పమిడిముక్కలకు చేరుకుని, ప్రజా వేదిక సభలో పాల్గొంటారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తారు. మధ్యాహ్నం 12:45 గంటలకు వీరంకిలాకు చేరుకుని, మే డే సందర్భంగా కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం పామర్రులో టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయి, గుడ్లవల్లేరుకు వెళ్తారు. అక్కడ LV ప్రసాద్ కంటి ఆస్పత్రిని ప్రారంభిస్తారు.