జగన్ జపం చేయకపోతే చంద్రబాబుకు నిద్ర కూడా రాదు: టీజేఆర్

9చూసినవారు
AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ స్టేట్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిరోజు వైసీపీ అధినేత జగన్ జపం చేయకపోతే సీఎం చంద్రబాబుకు నిద్ర కూడా పట్టదని అన్నారు. సీఎం చంద్రబాబు తన అఫిడవిట్‌లో రూ.1,300 కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారని అన్నారు. ఆ ఆస్తిలో అతని తమ్ముడు, చెల్లెలి వాటా ఎంత? అని ప్రశ్నించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు 5 ఎకరాల్లో కడుతున్న ఇంధ్రభవనంలో ఆ ఇద్దరికీ వాటా ఇస్తారా? అని అడిగారు.

సంబంధిత పోస్ట్