పోర్టులు, ఎయిర్‌పోర్టులపై చంద్రబాబు సమీక్ష

74చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో అధికారులతో నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏడు కొత్త ఎయిర్‌పోర్టులపై సమీక్ష నిర్వహించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులతో అభివృద్ధికి బాటలు వేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.