5 రోజుల పాటు రాయలసీమలో సీఎం చంద్రబాబు పర్యటన

394చూసినవారు
5 రోజుల పాటు రాయలసీమలో సీఎం చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు నాయుడు జూలై 1 నుంచి 5వ తేదీ వరకు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలలో భాగంగా పింఛన్ల పంపిణీ, హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ శంకుస్థాపన, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ ప్రారంభం, రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు. చంద్రబాబు ఈ జిల్లాలలోనే బస చేసి, 5వ తేదీన అమరావతికి తిరిగి చేరుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్