AP: చంద్రబాబుది నియంతృత్వ పాలన అని, ఈ నిరంకుశ పాలనలో ఎవరికీ రక్షణ లేదని
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సమస్యలపై నిరసన తెలిపితే అరెస్టులు చేయడం దుర్మార్గమని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ధర్నా చేస్తే ప్రభుత్వం ఎందుకు సహించలేకపోతోందని ప్రశ్నించారు.