AP: రాయలసీమ తీవ్ర కరువుతో అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు ఈవెంట్లతో కాలం గడుపుతున్నారని
వైసీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఈవెంట్లు, పబ్లిసిటీ కాదు.. ప్రభుత్వ భరోసా కావాలన్నారు. తక్షణమే రుణాల రీ షెడ్యూల్, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేవలం 388 మండలాలకే కరువు పరిమితం చేయడం అన్యాయమన్నారు.