చంద్రబాబు కంటితుడుపు మాటలు: జగన్

9చూసినవారు
చంద్రబాబు కంటితుడుపు మాటలు: జగన్
AP: చంద్రబాబు చెప్పేవి అన్నీ కంటితుడుపు మాటలని మాజీ సీఎం జగన్ అన్నారు. CBN పొగాకు రైతుల కష్టాలను గుర్తించి, రూ.50 వేల వరకు మూడేళ్ల పాటు వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించడంపై జగన్ విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీ పంట రుణాలు అందించామని, 84.66 లక్షల రైతులకు రూ.2,050 కోట్ల మేర లబ్ధి చేకూర్చామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసి, ఇప్పుడు అదే పథకాన్ని కొత్త పేరుతో ప్రచారం చేయడం మోసమని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్