చంద్రబాబు ఫోన్‌కు కేంద్రమంత్రి ఫిదా.. విశాఖ సభలో ఆసక్తికర ఘటన

2282చూసినవారు
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, చంద్రబాబు వాడుతున్న ఫోల్డబుల్ ఫోన్ ను ఆసక్తిగా పరిశీలించారు. చంద్రబాబు ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 9ప్రో ఫోల్డ్ ఫోన్ వాడుతున్నారు. ఈ ఫోన్ పుస్తకంలా మడవగలిగే డిజైన్, 8 అంగుళాల మెయిన్ డిస్ ప్లే, 6.3 అంగుళాల కవర్ డిస్ ప్లే కలిగి ఉంది. టెన్ సర్ జీ4 చిప్ సెట్, 16 జీబీ ర్యామ్, 48ఎంపీ ట్రిపుల్ కెమెరా, గూగుల్ ఏఐ ఫీచర్లతో వస్తుంది. దీని ధర సుమారు రూ.1.73 లక్షలు. గతంలో చంద్రబాబు ఐఫోన్, షియోమీ ఫోన్లను కూడా వాడారు. టెక్నాలజీని వాడటంలో చంద్రబాబు ఎంత అప్డేటెడ్ గా ఉంటారో ఈ సంఘటన తెలియజేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్