పులివెందులపై చంద్రబాబు ఫుల్ ఫోకస్!

21చూసినవారు
పులివెందులపై చంద్రబాబు ఫుల్ ఫోకస్!
AP: పులివెందులపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెట్టే 'ఎకనామిక్ పాలిటిక్స్'కు తెరలేపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలాన్ని రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రోడ్ మ్యాప్‌గా, కేస్ స్టడీగా చంద్రబాబు ప్రకటించారు. వైసీపీకి కంచుకోట లాంటి పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఉద్యానవన పంటల సాగు ద్వారా ప్రజల తలసరి ఆదాయం రూ. 7.30 లక్షలకు చేరిందని అన్నారు. వెనుకబడిన మండలంలో ఆదాయం పెరగడంపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్