కూటమి ప్రభుత్వంపై కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు

4601చూసినవారు
కూటమి ప్రభుత్వంపై కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు
AP: రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని, ప్రజలను క్యూలో నిలబెట్టే ప్రభుత్వం అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఏపీలో ఇంధన సంక్షోభంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసిందని, పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి దయనీయంగా మారిందని, స్టాక్ లేక బంకులు మూసివేశారని తెలిపారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, యూరియా కోసం ప్రజలను, రైతులను క్యూలలో నిలబెడుతున్నారని, వరి కోతలకు, ఆక్వా కల్చర్‌కు డీజిల్ లేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్