AP:
టీడీపీ అధినేత చంద్రబాబుపై
వైసీపీ అధినేత వైఎస్
జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హార్టికల్చర్‌పై చంద్రబాబు మాటలన్నీ డ్రామాలేనని, బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఖర్చు చేయడం అసాధ్యమని అన్నారు. చంద్రబాబు పాలనలో ధరల స్థిరీకరణ, నిధి నిర్వీర్యమైందన్నారు. రాయలసీమలో బోర్లు ఎండిపోయాయని, లిఫ్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబే అడ్డంకి అని పేర్కొన్నారు.