కేంద్రానికి చంద్రబాబు లేఖ

4735చూసినవారు
కేంద్రానికి చంద్రబాబు లేఖ
AP: రాష్ట్రంలో తోతాపురి మామిడి పండించే రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై సీఎం చంద్రబాబు స్పందించారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల మామిడి గుజ్జు ఎగుమతులు నిలిచిపోవడంతో స్థానిక మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడి, ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం లేఖ రాశారు. జూన్ నుండి ఆగస్టు వరకు కొనసాగే ఈ సీజన్‌లో రైతులను ఆదుకోవడానికి కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, అలాగే ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్ స్కీమ్ కింద రూ. 281 కోట్ల తక్షణ సహాయం మంజూరు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ నిధులు విడుదల చేస్తేనే రైతులను సంక్షోభం నుండి గట్టెక్కించగలమని సీఎం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్