AP: CM చంద్రబాబు నాయుడుపై YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి ల
క్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు జీవితమంతా అబద్ధాల మయమని, ఎన్నికలకు ముందు సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు. 'విజనరీ' అనే పదాన్ని కూడా చంద్రబాబు దొంగిలించారని, ఇతరుల ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేసి క్రెడిట్ కొట్టేసే వ్యక్తి అని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, అప్పటి నుంచి నైతిక విలువలు లేని
రాజకీయాలు చేస్తున్నారని లక్ష్మీపార్వతి హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు.