AP: కొత్త పారిశ్రామిక విధానాలను తేవడం, వాటిని హడావిడిగా రద్దు చేయడమే చంద్రబాబు పాలసీ అని టీటీడీ మాజీ ఛైర్మన్,
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘సరిగ్గా 18 నెలల క్రితం అన్నమయ్య జిల్లాలో రూ.10,300 కోట్లతో పంప్డ్ హైడ్రో స్టోరేజ్ అనే ప్రాజెక్టుకు జీవో ఇచ్చారు. కానీ.. ఇప్పుడేమో పర్యావరణ సమస్యలున్నాయని నిన్న అర్థరాత్రి ప్రాజెక్టును రద్దు చేస్తున్నామని జీవో ఇచ్చారు. అనుమతులు ఇచ్చేటపుడు చంద్రబాబుకు ఈ విషయం తెలియదా?’ అని ప్రశ్నించారు.