AP: సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో డ్రామాలు మానేసి పనులపై దృష్టి పెట్టాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని పోలవరం ఎడమ కాలువలోకి విడుదల చేసి, పోలవరం నీళ్లు తెచ్చేశామని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు కావని, పురుషోత్తపట్నం ప్రాజెక్టు, పంపులు వైఎస్సార్ హయాంలోనే నిర్మించారని, క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శించారు.