చంద్ర‌బాబుకు మెగలోమేనియా వ్యాధి: వైసీపీ నేత భూమన

13చూసినవారు
చంద్ర‌బాబుకు మెగలోమేనియా వ్యాధి: వైసీపీ నేత భూమన
AP: చంద్రబాబుకు “మెగలోమేనియా” వ్యాధి ఉందని, తనను తాను అతిశయోక్తిగా చిత్రీకరించుకోవడం ఆయన స్వభావమని వైసీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో తనను తాను అత్యున్నతుడిగా చూపించుకోవడమే కాకుండా, ఇతరులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చంద్రబాబు ఎప్పటినుంచో చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యుల ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు అత్యంత అభ్యంత‌ర‌మ‌ని భూమన వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్