ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను పంపిణీ చేయనున్న చంద్రబాబు

103చూసినవారు
ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను పంపిణీ చేయనున్న చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు డిసెంబర్ 1న ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి, ఉంగుటూరు మండలం నల్లమాడులో హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోపీనాథపట్నం గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం నల్లమాడులో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, ప్రజావేదిక వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు.