AP: కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఇది ప్రజల కోసం తీసుకున్న బలమైన నిర్ణయమని, సంక్షోభ సమయంలోనే నాయకత్వ బలం బయటపడుతుందని ఆయన అన్నారు. పీఎం మోదీ నాయకత్వంలో దేశానికి స్థిరత్వం లభిస్తుందని, ఇంధన ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ప్రజలకు ఊరట లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ తరపున ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.