రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌ను మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, హెచ్‌వోడీలు, కార్యదర్శులతో జరిగిన సదస్సులో మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని, దీనికోసం నిబంధనలను మార్చడంలో తప్పులేదన్నారు. అధికారులకు మరిన్ని అధికారాలు, ఫైళ్ల క్లియరెన్స్‌కు నిర్దేశిత సమయం, అనవసర నిబంధనలను తొలగింపు, టెక్నాలజీని అమలు చేయడం వంటి మార్పులు చేయనున్నట్లు తెలిపారు.