AP: రాష్ట్రంలో మద్యం బాటిళ్ల పరిమాణంలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 90, 180, 375, 750 ఎంఎల్ బాటిళ్లతో పాటు, ఇకపై 150, 200 ఎంఎల్ పరిమాణంలో కొత్త సీసాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్ల వద్ద బ్రాండ్ బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటును కూడా నిషేధించారు. ఈ మార్గదర్శకాలను ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు, అసిస్టెంట్ కమిషనర్లకు, డిప్యూటీ కమిషనర్లకు జారీ చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.