అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పు

22చూసినవారు
అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పు
AP: SIR ప్రక్రియలో బీఎల్‌వోలుగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ నేపథ్యంలో వారు పనిచేసే అంగన్వాడీ కేంద్రాల పనివేళలను తాత్కాలికంగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేంద్రాలు ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేయనున్నాయి. ఈ మార్పులు జులై 28 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. బీఎల్‌వోలుగా విధులు నిర్వహించని మిగతా అంగన్వాడీ కేంద్రాలు మాత్రం యథావిధిగా సాధారణ పనివేళల్లోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్