ఏపీలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూత్ లెవల్ ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వారి పనిభారాన్ని తగ్గించేందుకు, వారి కేంద్రాల నిర్వహణ సమయాల్లో తాత్కాలికంగా మార్పులు చేసింది. ఈ మార్పులు జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చి, జూలై 28 వరకు కొనసాగుతాయి. బీఎల్‌ఓ విధులు నిర్వహిస్తున్న కేంద్రాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. పౌష్టికాహార సరఫరాలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.