ఏప్రిల్ 1 నుంచి డిజిటల్ పేమెంట్లలో మార్పులు!

4406చూసినవారు
ఏప్రిల్ 1 నుంచి డిజిటల్ పేమెంట్లలో మార్పులు!
డిజిటల్ చెల్లింపులలో మోసాలను అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈ నిబంధనల ప్రకారం, అన్ని ఆన్‌లైన్ చెల్లింపులకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) తప్పనిసరి అవుతుంది. దీని ప్రకారం.. వినియోగదారులు లావాదేవీలను పూర్తి చేయడానికి OTPతో పాటు పిన్, పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్ వంటి రెండవ ధృవీకరణ పద్ధతిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ చర్య ద్వారా సైబర్ నేరగాళ్లు పాస్‌వర్డ్ లేదా OTP తెలిసినప్పటికీ లావాదేవీలను పూర్తి చేయలేరు. తద్వారా వినియోగదారులకు మెరుగైన భద్రత లభిస్తుంది.

సంబంధిత పోస్ట్