రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత కీలకమని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నిద్రపోయే సమయం మారడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ప్రమాదం రెట్టింపు అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఊలు పరిశోధకులు 3,231 మందిపై నిర్వహించిన అధ్యయనంలో, నిద్రవేళలో క్రమబద్ధత లేనివారిలో, ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయినవారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపించాయి. నిపుణులు రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, కనీసం 7-8 గంటలు నిద్రపోవడం, సెలవు దినాల్లోనూ నిద్రవేళను పెద్దగా మార్చకపోవడం వంటి అలవాట్లను సూచిస్తున్నారు.