అంగన్‌వాడీ కేంద్రాల సమయాల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే!

9869చూసినవారు
అంగన్‌వాడీ కేంద్రాల సమయాల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే!
AP: అంగన్‌వాడీ టీచర్లకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎల్‌ఓ (BLO) విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్ల పనిభారాన్ని తగ్గించేందుకు వారు పనిచేసే కేంద్రాల పని వేళలను తాత్కాలికంగా మార్చింది. జూన్ 29 నుంచి జూలై 28 వరకు ఆయా అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. ఈ మార్పు ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్రాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర అంగన్‌వాడీ కేంద్రాలు యథావిధిగా పాత సమయాల్లోనే కొనసాగుతాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందే పోషకాహార సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్