TG: ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ప్రస్తుతం మధ్యాహ్నం వరకే తరగతులు జరుగుతున్నాయి. అయితే, సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, విద్యాశాఖ ఈ అంశంపై అధ్యయనం చేయడానికి ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. స్కూల్ సమయాలను పెంచితే మధ్యాహ్న భోజనం, ఇతర వసతులు ఎలా కల్పించాలి, ఉపాధ్యాయులపై అదనపు భారం ఎంత పడుతుంది వంటి అంశాలపై కమిటీ నివేదికను సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకోనుంది.