వాతావరణంలో మార్పులు.. గాంధీ ఆస్పత్రికి పోటెత్తుతున్న రోగులు (వీడియో)

6438చూసినవారు
తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించి, రాష్ట్రమంతా విస్తరించడంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పాటు, గత రెండు రోజులుగా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల కేసులు గణనీయంగా పెరిగాయి. సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ గాంధీ జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి విపరీతంగా పెరిగి, అవుట్ పేషెంట్ వార్డులు, జనరల్ వార్డులు కిక్కిరిసిపోతున్నాయి. ఒంటి నొప్పులు, జ్వరం, ప్లేట్‌లెట్స్ పడిపోవడం వంటి లక్షణాలతో ఎక్కువ మంది బాధితులు ఆసుపత్రికి వస్తున్నారని వైద్యులు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక జ్వరాల వార్డులు, అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

సంబంధిత పోస్ట్