ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర సమీపిస్తున్న నేపథ్యంలో, కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఖర్చుల భారం పెరగనుంది. హెలికాప్టర్ ఛార్జీలను సవరించడంతో పాటు, పూజల రుసుములను కూడా పెంచారు. గుప్తకాశి నుండి వన్-వే ఛార్జీలు రూ. 6,077, ఫాటా నుండి రూ. 4,840, సిర్సి నుండి రూ. 3,043గా నిర్ణయించారు. కేదార్‌నాథ్‌లో ఒక రోజు పూజ రుసుమును రూ. 28,600 నుండి రూ. 51,000కు పెంచారు. బద్రీనాథ్‌లో కూడా పూజా రుసుములను పెంచారు. అయితే, సాధారణ దర్శనం యథావిధిగా ఉచితంగానే ఉంటుంది.