యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై భవిష్యత్‌లో ఛార్జీలు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనిపై RBI గవర్నర్ సంజయ్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ‘ఇప్పుడే క్లారిటీగా చెప్పలేం. ప్రస్తుతం ఛార్జీలను కేంద్రమే భరిస్తోంది. ఖర్చులను ఎవరో ఒకరు చెల్లించాల్సిందే. ఈ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బలోపేతం అవ్వాలనే మేం కోరుకుంటున్నాం. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూద్దాం’ అని అన్నారు. దీంతో ఛార్జీలు యూజర్లపై పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా డిజిటల్ చెల్లింపులు ఫ్రీగానే కొనసాగుతాయని కేంద్రం పేర్కొంది.