రైలు ప్రయాణంలో ఆర్ఏసీ (RAC) కింద టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీ వసూలు చేయడం సమర్థనీయం కాదని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ఆర్ఏసీలోనే ఉండి, బోర్డింగ్ సమయంలో బెర్త్ లభించని ప్రయాణికులకు ఛార్జీలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కమిటీ సూచించింది. ప్రస్తుతం ఆర్ఏసీ ప్రయాణికులు బెర్త్‌ను మరొకరితో పంచుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో, అలాంటి వారికి టికెట్ మొత్తంలో కొంత భాగాన్ని రీఫండ్ చేయాలని కమిటీ ఆదేశించింది.