మారుతున్న జీవనశైలితో యువతలోనూ బీపీ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ఐసోమెట్రిక్ వ్యాయామం ద్వారా హైబీపీని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కండరాలను ఒకే స్థితిలో ఉంచి చేసే ఈ వ్యాయామం రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అయితే గుండె జబ్బులు ఉన్నవారు, బీపీ నియంత్రణలో లేనివారు వైద్యుల సలహా తీసుకోవాలని, సరైన పద్ధతిలో వ్యాయామం చేయడం ముఖ్యమని హెచ్చరించారు.