CSK మరో వికెట్ కోల్పోయి పూర్తిగా కష్టాల్లో పడింది. 94 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా మ్యాట్ హెన్రీ (5) ఔట్ అయ్యాడు. రవి బిష్ణోయ్ (15.4) బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి అన్షుల్ కాంబోజ్ వచ్చాడు. ఆ ఓవర్లో కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై స్కోర్ 94/9గా ఉంది. RR మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది.