ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఓ ముస్లిం వివాహ వేడుకలో గందరగోళం చెలరేగింది. బిర్యానీలోని చికెన్ లెగ్ పీసుల విషయంలో తలెత్తిన వివాదంలో అతిథులు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఫంక్షన్ హాల్ లోని కుర్చీలు విసురుకుంటూ, టేబుల్లను పడగొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.