భారీగా తగ్గిన చికెన్ ధరలు.. సామాన్యులకు ఊరట

8856చూసినవారు
భారీగా తగ్గిన చికెన్ ధరలు.. సామాన్యులకు ఊరట
సంక్రాంతి, మేడారం జాతర ముగిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో రూ.300కి పైగా చేరిన కిలో చికెన్ ధర ఇప్పుడు రూ.240కి పడిపోయింది. కోళ్ల ఉత్పత్తి పెరగడం, డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో నాన్ వెజ్ ప్రియులకు, సామాన్యులకు ఖర్చు తగ్గడంతో ఊరట లభించింది. కోడిగుడ్ల ధరలు కూడా ఒక్కోటి రూ.9 నుంచి రూ.6కి తగ్గాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్