ఏపీలోని జంగారెడ్డిగూడెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం నాడు రెండేళ్ల చిన్నారి జెస్సీదీవెన అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని మృతి చెందింది. తండ్రి తినిపిస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పొరుగువారి సహాయంతో సపర్యలు చేసినా, చిన్నారి స్పృహ కోల్పోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.