బోరుబావిలో పడిన చిన్నారి.. రంగంలోకి ఆర్మీ, NDRF బృందాలు (VIDEO)

24758చూసినవారు
హరియాణాలోని అంబాలా జిల్లా ధనౌరా గ్రామంలో నాలుగేళ్ల బాలుడు నిర్భయ్ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. పొలంలో తండ్రి, తాతతో కలిసి వెళ్లిన బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో జారిపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, భారత ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సుమారు 220 అడుగుల లోతులో చిక్కుకున్న బాలుడికి పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తూ, ప్రత్యేక కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు బోరుబావికి సమాంతరంగా మరో గుంత తవ్వుతూ యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్