AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బాల్య వివాహం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 3న పెద్దల సమక్షంలో జరిగిన ఈ వివాహంపై స్థానికులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు వధూవరుల తల్లిదండ్రులు, పురోహితుడు, మండప నిర్వాహకుడు, ఫోటోగ్రాఫ్‌పై.. మొత్తంగా 14 మందిపై కేసు నమోదు చేశారు. మైనర్ అయిన వధువును గుంటూరు చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌కి తరలించారు. బాల్య వివాహం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.